దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమ్మలపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానల్లో చికత్స పొందుతున్న పేదప్రజలను ఆదుకోవాడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సీఎం సహాయనిధి నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని సర్పంచ్ భాగ్య ఎల్లం ,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ అన్నారు. శనివారం మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కులను తీరుమ్మలపూర్ గ్రామనికి చెందిన మంతెన స్వామికి రూ 36 వేల రూపాయలు నీరుడు విష్ణువర్ధన్ కు రూ, 15 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ సీఎం సహాయనిది చెక్కులను అందజేశారు . వారు మాట్లాడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక అసమానతులను తొలగించడానికి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సీఎం సహాయ నిధి పొందవచ్చు అని అన్నారు. స్వరాష్ట్రంలో 70 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అర్హులైన ప్రజందరికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు అనుభ విస్తూ వ్యాధుల బారిన పడి, దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి సీఎం సహాయ నిధి ఆసరాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మారగోని రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, ఏఎంసి డైరెక్టర్ నీరుడు సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింలు, లచ్చయ్య, బాల రాజయ్య, అంగడి రాజయ్య, గడ్డం స్వామి, యాకటి కిష్టయ్య, జనగామ రమేష్, బోటుక సత్తయ్య, కుమ్మరి కరుణాకర్, మల్లేశం, చుట్టాకుల శ్రీను, భాను, రమేష్ తదితరులు పాల్గొన్నారు
