గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు పల్లె సర్పంచ్ భర్త శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లు పల్లె గ్రామానికి చెందిన సర్పంచ్ గడ్డి ఎల్లవ్వ భర్త ముత్తయ్య(58) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన నయం కాకపోవడంతో వైద్యం తీసుకుంటూ ఇంటి వద్దనే ఉన్నాడు. శనివారం రాత్రి తీవ్ర అస్వసగుడైన ముత్తయ్య మృతి చెందాడు.ముత్తయ్య మృతి పట్ల కుటుంబ సభ్యుల్లో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అతనికి భార్య కొడుకు బిడ్డ ఉన్నారు.




