ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ కు వ్యవసాయ బోరు మోటారు రిపేరు చేయడానికి వచ్చిన నీరటి శ్రీనివాస్ ద్విచక్ర వాహనం దొంగిలించిన బానోతు తిరుపతి అనే వ్యక్తి నీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయగా సిరిసిల్ల కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ రాహుల్ రెడ్డి తెలిపారు.
ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ సంబంధించి రాజన్నపేట గ్రామ శివారులోని వ్యవసాయ బావివద్ద ఏర్పాటు చేసిన బోర్ మోటారు రిపేర్ కు రాగా అట్టి మోటారు రిపేర్ చేయడానికి తంగళ్ళ పల్లి మండలం గండి లచ్చపేట గ్రామానికి చెందిన నీరటి శ్రీనివాస్ కు చెందిన బైక్ ను ఈ నెల 8 న గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా అట్టి బైక్ ను సిరిసిల్ల మండలం చిన్న బోనాల గ్రామానికి చెందిన బానోతు తిరుపతి దొంగిలించినట్లు గుర్తించి అతనినిఅరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని సిరిసిల్ల కోర్టు నిందితుడు బానోతు తిరుపతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్ ఐ రాహుల్ రెడ్డి తెలిపారు.
