*సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండి* ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లోని వారసంత వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం లో భాగంగా ఎల్లారెడ్డిపేట హెడ్ కానిస్టేబుల్ రాజా నర్సర్ పాషా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు అని,ఆధునిక సాంకేతిక కాలంలో అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు పరికరాల వల్ల సైబర్ నేరాల శాతం పెరుగుతొందని,వివిధ రకాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ఉపయోగించక తప్పదని,కానీ అదే సమయంలొ ప్రజలు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి వుండాలి అని పేర్కొన్నారు.సైబర్ నేరగాళ్లు *ఆశ, భయం* అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.నకిలీ లాటరీలు,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ మొదలగు వంటి వాటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు తెలిపారు
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు DTDC కొరియర్ కి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ ని గూగుల్ లో సెర్చ్ చేశాడు.అది ఫేక్ నెంబర్ సైబర్ నేరస్థుడు ఒక లింక్ బాధితునికి పంపించి ఐదు రూపాయలు పేమెంట్ చేయమని చెప్పాడు.బాధితుడు ఆ లింకు ద్వారా ఐదు రూపాయలు పేమెంట్ చేశాడు. తద్వారా బ్యాంకుకు సంబంధించిన వివరాలు సైబర్ నేరస్తుడికి చేరడంతో 85,000/- వేల రూపాయలు మోసపోతాడు..
*తీసుకోవలసిన జాగ్రత్తలు:-*
• మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.
• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.
• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.
• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సతీష్, సధుర్ల సతీష్, శీను హోంగార్డ్ నరసింహులు పాల్గొన్నారు
