ప్రాంతీయం

*అభిమానానికి అవధుల్లేవ్..* – *నిజామాబాద్ నుండి ఇందుప్రియల్* – *ఆరు రోజుల ప్రయాణం* – *మంచి చేస్తే ఎనలేని గుర్తింపు* – *మహమ్మద్ సుల్తానా ఉమర్ ని కలవడానికి వచ్చిన మాదాస్తు సత్యనారాయణ*

139 Views

సమాజంలో మంచి పనులు చేస్తే ఎంతో గుర్తింపు వస్తుందని వాటికి తోడు ఎందరో అభిమానాన్ని గెలుచుకోవచ్చని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్ గారే నిదర్శనం. వారు చేసే సామాజిక ప్రజాసేవ కార్యక్రమాలను చూసి ఒక వీరాభిమాని నిజామాబాద్ జిల్లా నుండి ఆరు రోజులు ప్రయాణం చేస్తూ ఇందుప్రియల్ గ్రామంలో తాను అభిమానించే సుల్తాన గారిని కలిశాడు. మనం చేసే పనులే మనకు సమాజంలో గుర్తింపును తీసుకొస్తాయని అనడానికి ఇదే నిదర్శనం.ఎన్ని డబ్బులు,ఆస్తులు సంపాదించినప్పటికీ రాని పేరు ప్రఖ్యాతలు మనం చేసే మంచి పనులే ఎన్ని డబ్బులు పెట్టి కొనులేని ఆప్యాయత అభిమానులను సంపాదించి పెడతాయి. వాటి ద్వారా సమాజంలో గౌరవం గుర్తింపు వస్తుంది. గత నాలుగు సంవత్సరాల నుండి ఎన్నో సామాజిక ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్న ఇందుప్రియల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ నిరుపేద ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలకు సమాజంలో మంచి గుర్తింపు లభించింది. ఇటీవల ప్రచురితమైన దినపత్రికలో సుల్తాన ఉమర్ గారి ఆర్టికల్ చూసి వారు చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు అభిమానిగా మారి నాందేడ్ వాడ, సాయిబాబా టెంపుల్, నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి మాదాస్తు సత్యనారాయణ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఆర్టికల్ పేపర్ పట్టుకొని ఆరు రోజుల క్రితం బయలుదేరి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుండి పేపర్లో ఉన్న అడ్రస్ కనుక్కుంటూ తూప్రాన్ వచ్చారు. తూప్రాన్ నుండి గజ్వేల్ వరకు 28 కిలోమీటర్లు బస్సు చార్జిలు లేకపోవడంతో నడుచుకుంటూ గజ్వేల్ వచ్చాడు.గజ్వేల్ బస్టాండ్ లో ఇందుప్రియల్ ఊరు వెళ్లడానికి అడ్రస్ తెలుసుకుని చేగుంట బస్సు ఎక్కి ఇందుప్రియల్ గ్రామం చేరుకున్నాడు. కనిపించిన వారందరికీ పేపర్ కటింగ్ చూపించుకుంటూ అడ్రస్ వెతుక్కుంటూ చివరికి ఇందుప్రియల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ తాను ఎంతో అభిమానించే మహమ్మద్ సుల్తాన్ ఉమర్ గారిని కలిశాడు. అప్పుడు సత్యనారాయణ ఆనందానికి అవధులు లేవు. ఎన్నో రోజులుగా మిమ్మల్ని కలవడానికి బయలుదేరి వచ్చానని, ఎంతో ఆత్రుతతో తిండి డబ్బులు లేకున్నా ప్రయాణాన్ని కొనసాగించాను. వాటన్నిటిని మరిచిపోయి మిమ్మల్ని కలిసిన సంతోషం ఎనలేనిది అన్నారు. తన అభిమానాన్ని రాతపూర్వకంగా రాసి లెటర్ అందజేశారు. దినపత్రికలలో మీరు నిరుపేద అనాధ పిల్లలకు పేద ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలను చూసి నేను మరణించే లోపు మిమ్మల్ని కలవాలని నా ప్రయాణాన్ని మొదలు పెట్టానని ఆరు రోజులు ప్రయాణం చేస్తే గాని మిమ్మల్ని కలవలేకపోయాను అన్నారు. మీలాంటి వాళ్లు ఈ సమాజంలో ఉండడం ఎంతో గర్వకారణం అన్నారు. ఎంతోమంది ధనవంతులు, రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ సాటి మనిషికి సేవ చేయాలనే ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుందన్నారు. మీరు చేసే కార్యక్రమాలు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని, ఈ సమాజానికి మీ దంపతులు ఎంతో ఆదర్శమన్నారు. అనంతరం మహమ్మద్ సుల్తాన్ ఉమర్ గారు మాట్లాడుతూ మేము చేసే సేవా కార్యక్రమాలను చూసి నిజామాబాద్ జిల్లా నుండి ఆరు రోజులు ప్రయాణం చేసి సుమారు 30 కిలోమీటర్లు నడుచుకుంటూ నాకోసం రావడం ఇంతటి అభిమానాన్ని చాటినందుకు నాకు మాటలు రావడంలేదని, ఇలాంటి వారిని సంపాదించుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఇది నాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన. సత్యనారాయణ గారికి రుణపడి ఉంటామన్నారు. ఎంత సంపాదించిన చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్లలేమని మంచి పనులు చేస్తే మంచి పేరు సంపాదించవచ్చని ఉన్నదాంట్లో మాకు తోచిన సహాయం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.

సత్యనారాయణ పూర్తి యోగక్షేమాలు తెలుసుకొని క్షేమంగా ఇంటికి వెళ్లడానికి బస్సు చార్జీలు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని పంపించడం జరిగిందన్నారు. సమాజంలో మంచి పనులు చేస్తే ఎల్లప్పుడూ గుర్తింపు, విలువ ఉంటుందని సుల్తాన ఉమర్ పేర్కొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7