ప్రాంతీయం

బీఎస్పీ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి..

273 Views

బీఎస్పీ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి..

-బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్

సిద్దిపేట జిల్లా,గజ్వేల్, జనవరి 24, తెలుగు న్యూస్ 24/7

బహుజన సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీ సమీక్ష సమావేశం శనివారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్ము చంద్రం, అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ళ నరేష్, హాజరై మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా తెలిపారు. బహుజనులకు కేవలం బీఎస్పీ ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధ్యమని ఈ సందర్భంగా తెలిపారు.కాంగ్రెస్,బిజెపి ,బిఆర్ఎస్ పార్టీలు బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీల వ్యతిరేక పార్టీలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలను కేవలం ఓట్లప్పుడు వాడుకొని మిగతాసందర్భంలో కనీసం పట్టించుకోని పార్టీలకు ఓటు వేయొద్దని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే బీఎస్పీ పార్టీకి మాత్రమే ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైన ఈ సందర్భంగా మండిపడ్డారు . ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కనక ప్రసాద్, అసెంబ్లీ కార్యదర్శి శ్రీకాంత్ , బివిఎఫ్ కన్వీనర్ నాగరాజు,పరమేష్, అనిల్ మార్కుక్ మండల అధ్యక్షుడు నవీన్, శ్రీశైలం, ఉదయ్, టోనీ బెక్కల్, ప్రసాద్ మౌర్య, మొండి కరుణాకర్, బాల్నర్సు, అనిల్, ప్రసాద్,భాను, నవీన్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *