ముస్తాబాద్, ఏప్రిల్ 14 (ప్రభన్యూస్): స్థానిక మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించిన ఎంపీపీ జనగామ శరత్ రావు చెయ్.. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133.
వ జన్మదిన సందర్భంగా మండల కార్యాలయంలో తోటి మిత్రులతో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈరోజు భారతదేశ వ్యవస్థ మొత్తంకూడా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని కుల మతాలకు అతీతంగా భారతదేశం అందరికీ కూడాసమాన ప్రాతిపదికపై ఆనాడు డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే 140.కోట్ల మందిమి ఒకతాటిపై నడుస్తున్నామంటే దానికి కారణం రాజ్యాంగమే ఈరోజు రాజ్యాంగం లేనిదే భారతదేశంలో వ్యవస్థ లేదు నేటివరకు కూడా వార్డు మెంబర్ నుంచి మొదలుకొని రాష్ట్రపతి వరకు వారి విధివిధానాలు రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. దేశం ఒక వ్యవస్థమీద నడుస్తుంది అంటే ఆనాడు అంబేద్కర్ వారి బృందం రచించిన రాజ్యాంగం అందుకే అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలలో గర్వపడుతుందన్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యం వ్యవస్థ ప్రజల ఆకాంక్ష మేరకు ఆనాడే రాజ్యాంగంలో ఆర్టికల్ 370డి అనేదాన్ని పేజీలో పొందుపరిచి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు
పాస్ కాకున్నాకూడా పార్లమెంట్ వ్యవస్థద్వారా పార్లమెంట్ చట్టంద్వారా మహనీయుడు రచించిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగ పునాదులమీద ఏర్పడిందంటే వారు రచించిన రాజ్యాంగం ప్రకారమే కెసిఆర్ నిర్మించిన ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మరొకసారి ముస్తాబాద్ మండల ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు మండలంలోని ప్రతి ఊరూరా అంబేద్కర్ జయంతిని ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బైతి నవీన్, కోఆప్షన్ సాదులు పాప, ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, చెవుల మల్లేశం, బత్తుల అంజయ్య మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




