
ప్రజా పక్షం ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలం లోని దుమాల రాయపల్లి వంతెన పూర్తయ్యేది ఉన్నాడని పలు వాహనదారులు అధికారులను కోరారు అక్కపల్లి వీర్నపల్లి మండలానికి వెళ్లాలంటే రాయపల్లి వాగు దాటాల్సిందే వర్షాకాలం మొదలైందంటే చినుకులు పడితే చిత్తడిగా మారాల్సిందే భారీ వర్షాలు పడితే రాకపోకలు రవాణా స్తంభించి పోవడంతో దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాపల్లి నిర్మాణానికి టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తి చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులకు కాంట్రాక్టు పనులు ఇచ్చారు నిర్మాణం పూర్తి చేసి మధ్యలోనే ఆపివేశారు పనుల వేగం గా మారింది కాంట్రాక్ట్ తీసుకున్నా వ్యక్తులు తాత్కాలిక మట్టితో రోడ్డు వేశారు కొంతకాలంగా అదే రోడ్డుపై వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి మట్టిరోడ్డు ఒర్రెలు గా మారడంతో భారీ వాహనాలు వెళ్లాలంటే వీర్నపల్లి దుమలకు వెళ్లే వాహనాలు ప్రజలు భయం గుప్పిట్లో పెట్టుకుని గడపాల్సి వస్తుందని ప్రజాపక్షం తో అన్నారు వాగు దాటాలంటే నానా తంటాలు పడుతున్నారు అని వాహన దారులు చెబుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు పనులు పూర్తిచేసి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు




