జగన్ యూత్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు.
మంతెన జగన్‌మోహన్ రావు జన్మదినం పురస్కరించుకొని, ఆయన ప్రజాసేవా పంథాను స్మరించుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది.
జగనన్న అభిమాని గోనే రవీందర్ మరియు ఆత్మకూరి సంజీవ్ కుమార్, మిత్ర బృందం ఆధ్వర్యంలో,కేక్ కటింగ్, పండ్ల పంపిణి మరియు అన్నదానం కార్యక్రమం, ఇండియన్ రెడ్ క్రాస్ – ఆనంద వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించి వృద్ధులకు ప్రేమ–ఆప్యాయత పంచడం జరిగింది.
మరియు మంచిర్యాల రైల్వే స్టేషన్ యందు, గవర్నమెంట్ హాస్పిటల్ – మాత శిశు వైద్యశాల
రోగిణులకు, పిల్లలకు మరియు వారి కుటుంబ సభ్యులకు అన్నదానం నిర్వహించడం జరిగినది. మరియు ఏకలవ్య ఆశ్రమం లో పండ్ల పంపిణి చేసినారు. అదేవిదంగా దౌడపల్లి గ్రామంలో జగనన్న అభిమానులు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో స్మార్ట్ టీవీ ని అందించిన్నారు.
కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన వారు రహీం బ్లడ్ ఆర్గనైజర్ – అబ్దుల్ రహీం మరియు జగనన్న యూత్ అభిమానులు. జగన్‌మోహన్ రావు గారి ప్రజాసేవా ధోరణి
పేదలు, వృద్ధులు, చిన్నారులు, రోగులకు అండగా ఉండే సేవామనసు ఆయనను ప్రత్యేక సేవాదృక్పధతం గా నిలబెట్టిందని
భవిష్యత్తులో ప్రజలకు ఇంకా విశాలస్థాయిలో సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ,
జగన్‌మోహన్ రావు కి చిరకాల ఆయురారోగ్యం & ప్రజాభిమానంతో నిండిన సేవా ప్రయాణం కొనసాగాలని కోరుకున్నారు. అందరు కార్యక్రమం లో పాల్గొన్న అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు.





