గజ్వేల్ మండల భవన నిర్మాణ కార్మికుల కమిటీ ఎన్నిక
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల భవన నిర్మాణ కార్మికుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిద్దిపేట జిల్లా భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆదివారం నాడు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గజ్వేల్ భావన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా దాతరపల్లి నర్సింలు గజ్వేల్ మండల అధ్యక్షుడుగా, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి కార్యదర్శి చింతల బాబు , ప్రధాన కార్యదర్శిగా ఎరుకలి స్వాములు , కోశాధికారిగా సుతారి రాజయ్య లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో బాలశౌరి, సిద్దిపేట పట్టణ సెంట్రింగ్ సంఘం గౌరవ అధ్యక్షులు మల్యాల లక్ష్మీనారాయణ, సిద్దిపేట హౌసింగ్ అధ్యక్షుడు గీసా సాయిలు, ఉపాధ్యక్షులు నీలం మల్లేష్, సిద్దిపేట పట్టణ సెక్రటరీ కొత్త కనకయ్య, కొండపాక మండల అధ్యక్షులు జక్కుల కిషన్ తదితరులు పాల్గొన్నారు.





