ప్రాంతీయం

బీసీలకు టికెట్లు కేటాయించాలి కోఆర్డినేటర్…

122 Views

ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 14, జిల్లా కేంద్రం బీసీ భవన్ లోని విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలు బీసీలకు జనాభా రమాషా ప్రకారం టిక్కెట్లు ఇవ్వాల్సిందే అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. టిక్కెట్ కేటాయింపులు బీసీలకు సరైన ప్రాతినిధ్యం కలిగించకపోతే బీసీల ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలు కోల్పోతారని ఎలా అడుగుతారని ప్రశ్నించారు టిఆర్ఎస్ పార్టీ లాగానే బీసీలకు తగిన సీట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఏపార్టీ అయినా బీసీలకు తగిన న్యాయం టికెట్ విషయంలో న్యాయం జరగాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ లో డిక్లేషన్ ప్రకారం బీసీలకు 34 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని అన్నారు. బిజెపి పార్టీ బీసీలకు టికెట్ విషయంలో బీసీల జనాభా ప్రకారం అసెంబ్లీ సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలు 50శాతం ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి ప్రధాన పార్టీలు ప్రకటించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నాం లేదంటే బిసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు గౌరీ రాకేష్, ముదిరాజ్ లక్ష్మణ్, ధనుష్, స్వామి, నవీన్, రాము, తరుణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *