ప్రధమ చికిత్స అందించే విధానం అందించు విధానం గురించి అవగాహన కార్యక్రమం
సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆటో టాక్సీ డ్రైవర్స్ కి సురక్షితంగా వాహనం నడపడం ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రధమ చికిత్స అందించే విధానం అందించు విధానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన టూటౌన్ సీఐ ఉపేందర్ మాట్లాడుతూ ప్రయాణమే కాదు ప్రమాదం లేకుండా ఇంటికి చేరడం ముఖ్యం, ఎర్రివే ఏ లైవ్, అని పేర్కొనడం జరిగింది.దీంతోపాటు మైనర్స్ కి వాహనాలు ఇస్తే చట్ట ప్రకారం తల్లిదండ్రులకి జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని , అవగాహన రాహిత్యంతో రోడ్డుపై వాహనం నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు తోటి ప్రాణాలను కూడా అపాయం చేకూర్చిన వారవుతారని పేర్కొన్నారు.సిద్దిపేట మోటార్స్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని , సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదని విధిగా వాహనానికి సంబంధించిన పర్మిట్, ఫిట్నెస్ , ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ లాంటి ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు,రోడ్డుపై ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రత నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా తమ వంతు బాధ్యతను త్రికరణశుద్ధిగా నిర్వర్తించాలని సూచించారు. .అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి వాహనానికి రిఫ్లెక్టివ్ రేడియం అతికించుకోవాలని తద్వారా రాత్రి సమయంలో జరిగే ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చని సూచిస్తూ, కార్యక్రమానికి హాజరైన ఆటో ,టాక్సీ గూడ్స్ వాహన డ్రైవర్స్ తో రహదారి భద్రత ప్రతిజ్ఞను చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిద్దిపేట మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్.నారాయణ, సిద్దిపేట టూ టౌన్ సిఐ ఉపేందర్ సిద్దిపేట రవాణా శాఖ పాలన అధికారి షేక్ నజీర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ , ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ రవీందర్, విక్టోరియా ,హోమ్ గార్డ్ లు వెంకట్, అష్రఫ్ రామేశ్వర్ లు పాల్గొన్నారు.





