దౌల్తాబాద్ మండలం గ్రామాల్లో వివిధ బాధిత కుటుంబాలను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఇందుప్రియల్ గ్రామానికి చెందిన ఇద్దరికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేసినారు. అలాగే మాచీన్ పల్లి గ్రామానికి చెందిన రైతు బంధు అద్యక్షుడు అశోక్ కొడుకు చనిపోయిన విషయం తెలుసుకొని ఆ కుటుంబం ఓదార్చి ధైర్యం చెప్పారు.అక్కడినుండి శేరిల్లా గ్రామానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నడిపల్ల లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ నుండి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అలాగే కెసిఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఇతని పిల్లలను గవర్నమెంట్ హాస్టల్లో చదివిపిస్తామని మాట ఇచ్చారు. ఈయనా వెంబడి పిఎసిఎస్ చైర్మన్ అన్నా రెడ్డి గారి వెంకటరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకండి శ్రీనివాస్ ఇంధూప్రియాల్ ఎంపీటీసీ మల్లేశం సర్పంచులు శ్యామల కుమార్ యాదమ్మ శివకుమార్ మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.




