ఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శేఖర్ పేర్కొన్నారు. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేదోడువాదోడుగా నిలవడానికి, ఆర్థిక పరిస్థితి కారణంగా విద్యా పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





