ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 19, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అకాల వర్షాలకు, వడగండ్ల వానలకు రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారాన్ని అందించడంలో విపులమైందన్నారు. ఇప్పటికే రైతులు పండించే అకాల వడగండ్ల వర్షానికి పంట నష్టం అంచనా కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా రైతులు
శ్రమించి పండించిన కష్టానికి ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాలను అత్యంత త్వరగా ప్రారంభించి కనీసం పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందిస్తూ కొనుగోలు చేయాలని ముస్తాబాద్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షునిగా వరి వెంకటేష్ డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోకుండా రైతులపై దృష్టి సారించాలని తెలిపారు




