ప్రకటనలు

జ్యోతి రావు పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ

75 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం విగ్రహాల ఆవిష్కరణ చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ సంఘం అధ్యక్షులు జెల్లశ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు మాట్లాడారు. జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేనివని ఆయన బాటలోనే ముదిరాజ్ సోదరులంతా నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కోసం ముదిరాజ్ సోదరులు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్లలో ముదిరాజులకు ప్రాతినిధ్యం లేదని ఏకతాటి పైన నిలిచి మన సత్తా చాటినందుకే ఎంపీ టికెట్లలో బిజెపి, బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ముగ్గురికి ఎంపీ టికెట్లు పోటీ చేయడానికి ఇవ్వడం జరిగిందన్నారు. బీసీ ఏ లో కలపడానికి ముదిరాజ్ కులమంతా ఉద్యమించాలన్నారు. విగ్రహాల దాతైన డిప్యూటీ తాసిల్దార్ ఎలుసాని ప్రవీణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దొమ్మాటి నర్సయ్య, నిమ్మ లక్ష్మి. ఎంపీటీసీ అపేరా సుల్తానా, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్, మాజీ ఉప సర్పంచ్ సిరిపురం మహేందర్ డిప్యూటీ తాసిల్దార్ బురక గోపాల్, ముదిరాజ్ మండల సంఘం అధ్యక్షులు అంజయ్య గ్రామ సంఘం అధ్యక్షులు ఎలవేణి శ్రీనివాస్ ,పాముల దేవయ్య, మామిండ్ల బాల నర్సు, జెల్లా సత్తయ్య, జెల్లా రవి,నాంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్