ప్రాంతీయం

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గప్తను కలిసిన సంపత్ గుప్త

144 Views

గజ్వేల్ పట్టణ ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ అధ్యక్షులు తెరాస పార్టీ సహాయ కోశాధికారి ఉత్తునూరు సంపత్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తను మర్యాద పూర్వకంగా కలిసి, శాలువా కప్పి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఉత్తునూరి సంపత్ తెరాస పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ అందరి మన్నన పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, సంపత్ గుప్తా కు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. అలాగే ఉత్తునూరి సంపత్ గుప్తా మాట్లాడుతూ ఇటీవల లండన్ పర్యటన పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా, మునుగోడు ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేసిన సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త, సాయి, శంఖర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found