ప్రాంతీయం

ఎస్సై పై కేసు నమోదు

147 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు డివిజన్) ఏప్రిల్ 10

 

 

మహబూబాబాద్ జిల్లా : అకారణంగా ఒక పత్రిక విలేఖరి, అతని సోదరుడిపై దాడి చేసి చేతులు విరగ్గొట్టిన నర్సింహులపేట ఎస్.ఐ గండ్రాతి సతీష్ పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది.

నర్సింహులపేట మండలం నర్సింహపురం (బంజార) గ్రామానికి చెందిన మేకరబోయిన నాగేశ్వర్ అయన తమ్ముడు బ్రమ్మెష్ గత నెల 27 నా ఇచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు కేసు నెంబర్ : 491/36/20/2024 నమోదైంది. అలాగే జర్నలిస్ట్ నాగేశ్వర్ చేతులు విరగొట్టినందున కేసు నెంబర్: 492/36/20/2024 మరో కేసును తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నమోదు చేసినట్లు పేర్కొంది. గత నెల 15 తేది రాత్రి ఎస్. ఐ దాడి చేసి గాయపరిచి వారి మీదే అక్రమ కేసు పెట్టడని బాధితులు మేకరబోయిన నాగేశ్వర్‌, మేకరబోయిన బ్రమ్మేశ్ లు మానవ హక్కుల సంఘంకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విషయాలు పరిశీంచి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్ఐ గండ్రాతి సతీష్ పై కేసు మానవ హక్కుల ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు తమకు సమాచారం వచ్చినట్లు బాధితులు తెలిపారు. రాష్ట్ర డిజిపి, జిల్లా ఎస్పీకి ఈ మేరకు సమాచారం ఇచ్చారు.

 

 

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7