తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 10
దేశం సుభిక్షంగా. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే 3వసారి నరేంద్ర మోడి ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ పిలుపునిచ్చారు.ఈ రోజు తొర్రూరు లో స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపం లో తొర్రూరు అర్బన్, రూరల్, పెదవంగర మరియు రాయపర్తి మండలాల
- బిజెపి పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాలనలో అవినీతి లేని పాలనను అందించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడి కి దక్కుతుందన్నారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి కృషి చేయకపోయినా ఈ ప్రాంత అభివృద్ధికి మోడి కృషి చేశారని, ఈసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని అందులో భాగంగా మామునూరు విమానాశ్రయం, వరంగల్ ఏనుమాములలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పాలకుర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు మోడల్ పార్లమెంట్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా,నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని,ఈ ప్రాంత అభివృద్ధిలో తన వంతు కృషి చేసేందుకు మీ ఆశీర్వాదాలు అందించాలని కోరారు.రాయపర్తి మాజి ఎంపీపీ నాగపురి రాంబాబు, తొర్రూరు పట్టణానికి చెందిన చలువాది సత్యనారాయణ,కేవ్ సింగ్ ,లతో పాటు మరికొంత మంది పార్టీ లో చేరారు. పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ సభాద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు,వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి రాజేశ్వరరావు, మానుకోట జిల్లా అధ్యక్షులు వైవీ రావు,, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగ రామ్మోహన్ రెడ్డి,మురళీధర్ గౌడ్, కుమారస్వామి,కోటేశ్వర్, మురళీ, మనోహర్, తిరుపతి రెడ్డి, దామోదర్ రెడ్డి,ధర్మారపు వెంకన్న, కొలుపుల శంకర్, పల్లె కుమార్,సాయిని ఝాన్సీ,రచ్చ కుమార్, నరేందర్, పులేందర్, అలిసేరి రవిబాబు, వడ్లకొండ రవి, బొచ్చు సురేష్, పైండ్ల రాజేష్, మంగళపళ్ళి యాకయ్య,గడల శేఖర్,, గట్ల భరత్, కాగు నవీన్, గంధం రాజు, విజయ్ కుమార్, రాజకుమార్, జగదీష్, శ్రీనాథ్, శ్రీనివాస్, నాగేష్, సంతోష్, శివ,రాజు, అనిల్,శ్రవన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.




