మండల పరిధిలోని పోసన్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజున వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ పొసన్ పల్లి గ్రామంలో రైతులు అధికంగా వరి ధాన్యాన్ని పండిస్తారని అక్కడ వడ్లకు కొనుగోలు కేంద్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పిటిసి దృష్టికి తీసుకెళ్లగా అక్కడి గ్రామ రైతులకు అనుకూలంగా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామ ప్రజలు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులు పండించిన పంటను దళారులను నమ్మి మోసపోవద్దని ఐకెపి కేంద్రాలలోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు గుర్తు చేశారు. గ్రామంలో ఐకేపీ సెంటర్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తో పాటు జిల్లా కో ఆప్షన్ రహిమ్, వైస్ ఎంపీపీ శేఖర్, ఐకెపి అధికారులు, గ్రామస్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
