మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం.
తేదీ 25-10-2025 శనివారం రోజున కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో MRO రఫతుల్లా మరియు కాంగ్రెస్ నాయకులు 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
కాంగ్రెస్ ప్రభత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్ధిక ఒడిదొడుకులు తట్టుకొని సంక్షేమ పథకాల పంపిణీకి ఎటువంటి ఆటంకం కలగకుండా లబ్ధిదారులకు పథకాలను అమలు పరుస్తుంది అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని పంపించారు.





