పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం…
మంచిర్యాల నియోజకవర్గంలో
మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి శ్రీ దుద్ధీళ్ళ శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి దనసరి అనసూయ (సీతక్క), ఎమ్మెల్యేలు వినొద్, వివేక్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, INTCU జాతీయ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్,
కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
