ముస్తాబాద్/నవంబర్/11; గురువారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ముందస్తుగా CHILDREN’S DAY సందర్భంగా మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా PET, HM,DEO,CLERK కార్యాలయ సహాయకులుగా వివిధ హోదాలను చక్కగా పోషించి వారే స్వయంగా ఒకరోజు పాఠశాల నిర్వహణ చేసి అందులో ఇమిడి ఉన్న అనేక పాలనా పరమైన బోధనా పరమైన అంశాలను అవగాహన చేసుకోగలిగే అవకాశం కార్యక్రమం చేశారు. ఈరోజు HM గా M. SRINIDHI, DEO గా D.AKSHAYA వ్యవహరించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్ మాట్లాడుతూ పాఠశాల విద్య కు సంబంధించి విద్యార్థులకు అనేక రంగాలకు చెందిన అంశాలను అవగాహన, పాత్రల పోషణ స్వీయ అనుభూతి కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమ నిర్వహణ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, రాజ్ మహ్మద్, శారదాదేవి, ఉమామహేశ్వరి, రమణ, శంకరయ్య, లక్ష్మణ్, తిరుపతి, సంధ్యారాణి, శంకర్, కళ్యాణ్, స్వప్న , రవిలు పాల్గొన్నారు.
