ప్రాంతీయం

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

101 Views

దౌల్తాబాద్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపిటిసి వీరమ్మ మల్లేశం, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు లు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో బీఆర్ఎస్వి, కమిటీలను ఎన్నుకున్నారు. యూత్ అధ్యక్షుడిగా వీరమ్మ స్వామి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షునిగా నర్సింలు, ఉపాధ్యక్షులంగా బాలకృష్ణ, సల్వార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి లక్ష మెజారిటీతో గెలిపిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వేంపల్లి శ్రీనివాస్, నాయకులు ప్రేమ్ కుమార్, నవీన్, రమేష్, గోపి, స్వామి ,నరేష్ తదితరులు పాల్గొన్నారు…..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *