ప్రాంతీయం

సమస్యల వలయంలో హైస్కూల్…

137 Views

ముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/11;  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో కుసుమ రామయ్య హై స్కూల్ లో వున్న మూత్రశలలో తీవ్రమైన దుర్వాసన వల్ల మధ్యన భోజన సమయం లో తీవ్ర ఇబ్బంది గురి అవ్వడం వలన దాదాపు 600 నుండి విద్యార్ధులు వున్న పాటశాలలో కనీసం మూత్రశాలలు పరిశుభ్రకంగా వుంచకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్ధులు అనారోగ్యనికి లోనవ్వడం జరుగుతుంది. అలాగే మద్యన భోజన సమయంలో విద్యార్తులకి మూత్రశాల దగ్గరే అన్నం పెట్టడం సమీపంలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం వల్ల తినడానికి ఇబ్బందిగా వున్నది. మూత్రశాలలో నుండి బయటకి వచ్చే మోరీ నీళ్ళు మొత్తం కూడా స్కూల్ గ్రౌండ్ లోకి రావడం వల్ల ఆనీటిని తొక్కుతూ రావడం, దుర్వాసన వల్ల విద్యార్ధిని విద్యార్థులు ఇబ్బంది పడస్ట్రీ వస్తున్నది. ప్రభుత్వం వెంటనే పాటశాలలో మూత్రశాలలు శుభ్ర పరచాలని మూత్రశాల& సెప్టిక్ ట్యాంక్ ఆవరణంలో వున్న వంటశాలను వడ్డించే స్థలాన్నీ మార్చాలని బీసీ విద్యార్ధి సంఘం ఆద్వర్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత తొందరలో పై సమస్యలకి పరిష్కారం చూపాలని బీసీ విద్యార్థి సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ, మండల అధ్యక్షులు మట్టే నరేష్, పోతర్లా వంశీలు పాల్గొన్నామని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7