తెలుగు 24/7 న్యూస్ తొర్రూరు ప్రతినిధి ఎప్రిల్ 06
పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడీ,పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశ్యశ్విని రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ గడ్డపై జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేందుకు తుక్కుగూడలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన జాతర బహిరంగ సభకు తొర్రూరు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.ఈ సందర్భంగా మాజి టీపీసీసీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు హనుమాండ్ల తిరుపతిరెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశ దశ – దిశ మార్చుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ అనుమాండ్ల నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు పెదగాని సోమయ్య, నాయకులు చిత్తలూరు శ్రీనివాస్ గౌడ్,మెరుగు మల్లేశం గౌడ్,నరేందర్ రెడ్డి, సోమిరెడ్డి,వల్లపు యాకయ్య, ఇమ్మడి శ్రీనివాస్, సతీష్,రోహిత్, పూల నాయక్, సురేందర్,గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
