ప్రాంతీయం

మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష

72 Views

సాగు నీరు అందక ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల రూపాయల చెల్లించాలని డిమాండ్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

కుటుంబ పాలనను కొనసాగిస్తున్న వివేక్ కుటుంబాన్ని పార్లమెంట్ నుండి తరిమికొట్టాలి – బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్.

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యరెంటీలను 2 లక్షల రుణ మాఫీ, 15 వేల రూపాయల రైతు భరోసా మరియు సాగు నీరు అందక ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరాబెల్లి ఆధ్వర్యంలో “సత్యాగ్రహ దీక్ష” కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ అని గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు 2 లక్షల రూపాయల రుణ మాఫీ, ఎకరానికి 15 రూపాయల రైతు భరోసా, వరికి 500 రూపాయల బోనస్ వంటి అబద్ధపు హామీలను ఇచ్చి రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. అప్పుడు ఉన్న టీ.అర్.స్ ప్రభుత్వం కట్టింగ్, తరుగు పేరుతో రైతులను దోచుకుటుంటే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు సాగు నీరు అందక పంటకు ఎండిపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండ రైతులను ముంచుతున్నరని అన్నారు.

ఈ పార్లమెంట్ లో కుటుంబ పాలన కొనసాగిస్తున్న వివేక్ వెంకట్ స్వామి గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత ఒక్కసారి కూడా రైతుల పక్షాన అసెంబ్లీ లో మాట్లాడలేదని అన్నారు. వివేక్ వెంకట్ స్వామికి కొడుకును ఎంపీ చేయాలని తపన తప్ప ఇక్కడి రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని మరియు రైతులకు యూరియా కష్టాలు రావద్దని 6300 కోట్ల రూపాయలతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునర్ నిర్మించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని భారీ మెజార్టీ తో గెలిపించాలని అన్నారు.

ఈ సందర్భంగా గోమాసే శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సాగు నీరు అందక రైతులు తీవ్రంగా నష్ట పోయారని వారిని ఆదుకోవాలన్న కనీస సోయి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే లు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మరియు సాగు నీరు అందక ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్, దుర్గం అశోక్, పట్టి వెంకట కృష్ణ, ముల్కల్ల మల్లా రెడ్డి, కోయ్యాల ఏమాజి, పెద్దపల్లి పురుషోత్తం, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పురుషోత్తం జాజు, మున్నరజ సిసోడియా, మోటపలుకుల గురువయ్య, ఆకుల అశోక్ వర్ధన్, కొంతం శంకరయ్య, గుండా ప్రభాకర్, రేకాందర్ వాణి, మోటపలుకుల తిరుపతి, కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, బోలిషెట్టి అశ్విన్, వంగపల్లి వెంకటేశ్వర రావు, గడ్డం స్వామి రెడ్డి, గోపతి రాజయ్య, వీరమల్ల హరిగోపాల్, గుండవరపు మధుసూదన్ రావు, సత్రం రమేష్, ఠాకూర్ శైలందర్, ప్రసాద్, దార కల్యాణి, వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్