రాంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు
నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్
ఎల్లారెడ్డిపేట నవంబర్
♥
Your message has been sent
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య -సంతోషి కుమార్తె ఏంజెల్ జాతీయస్థాయి రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఏంజెల్ రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందించారు. ఏంజెల్ తో పాటు పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు గోల్డ్ మెడల్ తో పాటు షీల్డ్, ప్రశంస పత్రాలను సాధించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, ఆధ్యాపక బృందం అభినందించి చదువుతోపాటు క్రీడాలలో విద్యార్థులు తమ స్థాయిలో నైపుణ్యత కలిగిన రంగాలలో రాణించి తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఎంఈఓ కృష్ణ హరి అన్నారు, రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య. సంతోషి కుమార్తె రెండవసారి రాణించడంతో వివిధ పార్టీల నాయకులు, అధికారులు ఏంజెల్ ను అభినందించారు.





