ఆరోగ్యకరమైన,పటిష్ట ఓటరు జాబితా తయారీ కి కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగాఎల్లారెడ్డిపేట మండలం పదిర, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో పర్యటించారు.
పదిర, ఎల్లారెడ్డి పేట గ్రామాల్లోని ఏ ఏరియాలో ఓటరు జాబితా నుంచి ఎన్ని తొలగింపులు చేశారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఓటరు జాబితాలో మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన అందరి పేర్లు ఉన్నాయా?అంటూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో ప్రజలను ప్రశ్నించారు. ఉన్నాయంటూ వారు సమాధానం ఇచ్చారు..మరణించిన వ్యక్తులను జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో ఆ వివరాలను క్షేత్ర స్థాయిలో సదరు ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులతో ఆ విషయాన్ని క్రాస్ చెక్ చేసి రూఢి చేసుకున్నారు. జాబితాలోని వివరాలు అన్ని సరిగ్గా ఉన్నట్లు తెలియడంతోయు హావ్ డన్ ఫెయిర్ జాబ్ అంటూ తహశీల్దార్ బి.రాంచందర్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు.
