ప్రాంతీయం

గుడుంబా అమ్ముతున్న మహిళని జైలుకిత…

112 Views
ముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రానికి చెందిన పల్లెపు రాధిక అక్రమంగా గుడుంబా అమ్ముతూ గురువారం ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం… గతంలోనూ పల్లెపు రాధిక మండల కేంద్రంలో పలుమార్లు అక్రమంగా గుడుంబా అమ్ముతు పట్టుబడినట్లు ధ్రువీకరించారు. పల్లెపు రాధికని మొదటిసారిగా అక్రమంగా గుడుంబా అమ్ముతున్న నేరంలో పట్టుకొన్న ఎక్సైజ్ పోలీసులు ఆమెను స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో బైండోవర్ చేశారు. పల్లెపు రాధికని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో బైండోవర్ చేసినా కానీ ఆమె గుడుంబా అమ్మకాలు ఆపలేదు. దీనితో స్థానిక ముస్తాబాద్ తహసిల్దార్  పల్లెపు రాధికకు బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు  లక్ష రూపాయల జరిమాన కట్టాలని పలుమార్లు నోటీసులు అందించారు. పల్లెపు రాధిక తహసీల్దార్ నోటీసులపై స్పందించకపోవడంతో స్థానిక తహసిల్దార్ పల్లెపు రాధికకు  సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ  ఆదేశాలిచ్చారు. తాహసిల్దార్ ఆదేశాల మేరకు పల్లెపు రాధికను కరీంనగర్ జైలుకు తరలించిన ఎక్సైజ్ అధికారులు మండలంలో ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ  ఎం శ్రీనివాస్  హెచ్చరించారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్