ప్రాంతీయం

పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు

101 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

పదవి విరమణ పొందుతున్న  పోలీస్ అధికారులకు సీపీ కార్యాలయంలో అత్మీయ  వీడ్కోలు.

1989 సంవత్సరంలో పోలీసు శాఖలో చేరి గత  35 సంవత్సరాలు పోలీసు శాఖ లో అమూల్యమైన సేవలు అందించిన  వెంకటేశ్వర్ రావు పీసీఆర్ రామగుండం,1983 సంవత్సరంలోపోలీసు శాఖలో చేరి 41 సంవత్సరాలు పని చేసిన హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, రామగుండం పిఎస్,1984 సంవత్సరంలోపోలీసు శాఖలో చేరి  40 సంవత్సరాలు పని చేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పి.అంజయ్య , రామగుండం, 1984 సంవత్సరంలో పోలీసు శాఖలో చేరి    34 సంవత్సరాలు పని చేసిన   హెడ్ కానిస్టేబుల్ ఎం. డి అజిజ్ బేగ్, బసంత్ నగర్ పిఎస్,ల పదవీవిరమణ సందర్బంగా సీపీ  కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేసి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ,పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగి కి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అని శుభాకాంక్షలు తెలియజేస్తు పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు  నిర్వహించి  చేసిన  సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్‌ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన సంప్రదించవచ్చని.“పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని అన్నారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా,పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు , ఏఓ సతీష్, రామగుండం పోలిస్  కమీషనరేట్ పోలిస్ సంఘము అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, స్వామి, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.

No Slide Found In Slider.

Poll not found