Breaking News

బహిరంగ చర్చకు సిద్ధమా….

95 Views

ఏప్రిల్ 3, 24/7 తెలుగు న్యూస్ :మంత్రి జూప‌ల్లి ప్రెస్ మీట్..

మాజీ సీయం కేసీఆర్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నారు.

న‌వ్వితే నాకేటి …. అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కేసీఆర్ కుటుంబం అడ్డు అదుపు లేకుండా సంప‌ద‌ను సృష్టించుకుంది.

వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు.

కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు ప‌దేళ్లలో ఏనాడు రైతుల వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు.

ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ల‌బ్ది పొందేందుకు రైతుల‌పై మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు.

కేసీఆర్ సీయంగా ఉన్న‌ప్పుడు పంట‌ల బీమా ప‌థ‌కం అమ‌లు చేయ‌లేదు, పంటన‌ష్టం ఇవ్వ‌లేదు.

ఇన్ పుట్ స‌బ్సిడీ లేదు… ఇలా రైతుల‌ను ఆధోగ‌తి పాలు చేసింది కేసీఆరే.

ఇవాళ రూ. 25 వేల పంట న‌ష్టం ఇవ్వాల‌ని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నాడు.

2023లో అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు మాత్ర‌మే కొంత‌మేర న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు.

అంత‌కుముందెప్పుడు ప‌రిహారం చెల్లించిన దాఖ‌లాలు లేవు._

దీనిపై కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మా.

కృష్ణా జ‌లాల‌ను ఏపీ త‌రలించుకుపోతుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించారు.

బీఆర్ఎస్ పాల‌న‌లో కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలో రెండో పంట‌కు నీళ్లు ఇచ్చిన దాఖ‌లు లేవు.

గోదావ‌రి జ‌లాల‌ను స‌ముద్రం పాలు చేశారు.

అందుకే ప్ర‌జ‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మీకు బుద్ది చెప్పారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది.

ఎన్నిక‌ల త‌ర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కావ‌డం ఖాయం.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంత ఓట్లు అడిగే నైతిక హ‌క్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది.

ఉమ్మ‌డి పాల‌మూర్ జిల్లాలోని రెండు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నాం.

తెలంగాణ‌లోనూ అత్య‌ధిక స్థానాలను కైవ‌సం చేసుకోబోతున్నం.

సీయం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హ‌మీల‌ను నెర‌వేరుస్తుంది.

100 రోజుల్లోనే ఐదు గ్యారంటీల‌ను అమ‌లు చేశాం.

గతంలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హ‌మీని నిల‌బెట్టుకోలేదు.

ఇప్పుడు మమ్మ‌ల్ని అడిగే హ‌క్కు మీకెక్క‌డిది.

ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మెఘారెడ్డి, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ సరిత తిరుపతయ్య, నాగ‌ర్ క‌ర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి మ‌ల్లు ర‌వి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7