ప్రాంతీయం

మామిడి కూడా గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

52 Views

మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, మామిడి కూడా గ్రామం.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ కాసిపేట మండలంలోని మామిడి కూడా గ్రామాన్ని సందర్శించి తగు సూచనలు జారీ చేసినారు మామిడి కూడా గ్రామంలో గత రెండు రోజుల నుండి దగ్గు జలుబుతో కూడిన జ్వరాలు రావడం వలన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ వైద్య శిబిరంలో 62 మందికి చికిత్సలు చేయడం జరిగినది 12 మందికి రక్త పరీక్షలు చేసి వైద్యం అందించడం జరిగినది గ్రామంలో పరిశుభ్రత నీటి నిల్వలు చూడడం జరిగినది వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి తిరిగి రాపిడ్ ఫీవర్ సర్వే చేయడం జరిగినది అదేవిధంగా నీరు నీ నిలువ లేకుండా చేయడం దోమల ఆరువాలను చంపడం సెమీఫస్ట్ నీటి నిలవల్లో పిచికారి చేయడం జరిగినది ఈ గ్రామంలోని ప్రజలందరూ ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు ఎలాంటి భయాందోళనకు గురికానవసరం లేదు డాక్టర్ రవి కిరణ్ వైద్యాధికారి ద్వారా ఇంకా రెండు రోజులపాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగినది అదేవిధంగా వైద్య సిబ్బంది రోజు ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించాలని వైద్య శిబిరంలో చికిత్సలు చేయించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని దోమలు కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన పరిసరాల పరిశుభ్రత పైన వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కలిగించాలి అని తెలియజేసినారు అదే విధంగా పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీ సిబ్బంది మీరు నిలువ లేకుండా నాళాలలో చర్యలు తీసుకోవాలని కోరినారు.

ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించి తగు చికిత్సలు అందించినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్ ఉపవైద్యాధికారి, డాక్టర్ కిరణ్ వైద్యాధికారి, శ్రీనివాస్ నాందేవ్, సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి, వెంకట సాయి పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్