(తిమ్మాపూర్ ఏప్రిల్ 01)
జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి అభిలాష్ మృతి చెందిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ మంచి హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద అభిలాష్ కుటుంబ సభ్యులను కలిశారు. మహాత్మా నగర్ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో అభిలాష్ మృతదేహం మార్చి 27న లభ్యం అయింది.అయితే అభిలాష్ తల లేకుండా మొండెం మాత్రమే దొరకడంతో ఇంకా పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. తిమ్మాపూర్ లో మంత్రి శ్రీధర్ బాబు బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…
కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల రక్షణ పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. సదరు కాలేజీ యాజమాన్యం ఈ నిర్లక్ష్యం వల్లే అభిలాష్ మృతి చెందాడాని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారన్నారు. కాలేజీ యాజమన్యాం కూడా బాధ్యతతో మెదలాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో పోలీసులు కూడా అన్ని కోణాల్లో విచారించి అతనిది హత్య… ఆత్మహత్యనా అనేది తేల్చాలన్నారు. అభిలాష్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని శ్రీధర్ బాబు అభిలాష్ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు…