Breaking News

కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం…..* మొక్కలు నాటిన మేయర్, వర్ధన్నపేట శాసనసభ్యులు….

105 Views

*కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం…..*

మొక్కలు నాటిన మేయర్, వర్ధన్నపేట శాసనసభ్యులు….

బల్దియా ఆధ్వర్యం లో నిర్వహణ….

*GWMC,24 జూలై 2023:*

రాష్ట్ర పురపాలక, ఐటీ ,పరిశ్రమల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకొని బల్డియా పరిధి 14వ డివిజన్ సుందరయ్య నగర్ లో కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ పాల్గొని సంయుక్తంగా మొక్కలను నాటి మంత్రి వర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్థానిక వర్ధన్నపేట శాసన సభ్యుల ఆధ్వర్యంలో పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, స్లమ్ ఏరియాలో పార్కు నిర్మాణానికి చొరవ తీసుకొని మొక్కలు నాటడం జరిగిందని, ఇందులో జిమ్ సెంటర్,వాకింగ్ ట్రాక్ తో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, మంత్రి జన్మదినం సందర్భంగా ఇట్టి పార్కుకు కేటీఆర్ పార్క్ అని పేరు పెట్టడం జరిగిందని,ఇట్టి పార్కులో ఎం.ఎల్.ఏ తో కలిసి మొక్కలు నాటి ప్రారంభించు కోవడం జరిగిందని,మంత్రి వర్యులు కే.టి.ఆర్. ఇండస్ట్రీ, ఐ.టి.శాఖ,మునిసిపల్ శాఖ లను సమర్థవంతంగా నిర్వహిస్తు ముందుకు తీసుకువెళుతున్నరని,వారికి హృదయ పూర్వకం గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూన్నట్లు, వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, వారి నాయకత్వంలో భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని, యువ నాయకులుగా విదేశాల్లో పర్యటిస్తూ అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నారని, వరంగల్ నగరంలో టెక్స్టైల్ పరిశ్రమను ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టేలా కంపెనీ లను ఆహ్వానించి యువతకు, మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్న మంత్రి కి ఈ సందర్భం గా మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గతంలో బెంగళూరు నగరానికి ఐటీ దిగ్గజంగా పేరు ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఐ .టి.హబ్ (దిగ్గజం) గా మారిందని, కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని టి.ఎస్- బి పాస్ వంటి పారదర్శకమైన విధానాలను తీసుకువచ్చి ప్రజల ముంగిటకే సేవలు తీసుకువచ్చారని, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అధునాతన నగరంగా తీర్చి దిద్దడానికి అనేక నిధులను కేటాయించి భద్రకాళి బండ్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లను చేపట్టిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందని మేయర్ అన్నారు.

వర్థన్న పేట శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోనీ మండల కేంద్రాల్లో గ్రామ గ్రామాన, వాడల్లో, ఆలయాల్లో యంగ్ &డైనమిక్ రాష్ట్ర ఐ.టీ,పురపాలక శాఖ మంత్రి వర్యులు కే.టి.ఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇందులో భాగం గా సుదీర్ఘ కాలం సుందరయ్య నగర్ లో ఖాళీ గా ఉన్న స్థలాన్ని కేటీఆర్ పార్కుగా తీర్చి దిద్దాలని కాలనీ వాసులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, మేయర్,కార్పొరేటర్లు,ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటడం జరిగిందని,మంత్రి వర్యులు ప్రపంచ వ్యాప్తం గా పర్యటించి,రాష్ట్రం లో అనేక కంపెనీ,ఇండస్ట్రీ లు పెట్టుబడి పెట్టడానికి ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసునని,యువతకు,మహిళలకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్న మంత్రి వర్యులకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, వద్దన్నపేట నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను పెద్దయెత్తున నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా బల్దియా కు చెందిన కార్పొరేటర్లు,ఉన్నతాధికారులు, సిబ్బంది, ఆర్పీలు మొక్కలను నాటి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్ లు తూ ర్పాటి సులోచన సారయ్య, జన్ను షిభా రాణి అనిల్ కుమార్, ఆర్.ఎఫ్. ఓ.పాపయ్య,ఎస్.ఈ లు ప్రవీణ్ చంద్ర కృష్ణ రావు సి.హెచ్.ఓ శ్రీనివాసరావు,ఎం.హెచ్. ఓ.జ్ఞానేశ్వర్, ఈ.ఈ.లు రాజయ్య, శ్రీనివాస్,సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *