141 Views
-మున్నూరుకాపు జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ శీలం స్వామి…

ముస్తాబాద్/అక్టోబర్/11 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ శీలం స్వామి మాట్లాడుతూ… మున్నూరు కాపుల అభివృద్ధి కొరకు ప్రభుత్వంలో తనవంతు పాత్ర పోషిస్తున్న మున్నూరుకాపు కుల బాంధవుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇండ్లపై ఈడి మరియు ఐటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. అన్నిరకాల అనుమతులతో నడిపిస్తున్నటువంటి గ్రానైట్ వ్యాపారాన్ని మాఫియాలాగా చిత్రీకరిస్తున్నారని తెలియజేస్తూ… వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించినటువంటి మున్నూరు కాపులు అంచలంచలుగా ఎదుగుతూ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా బలపడాలనుకుంటున్న తరుణంలో ఇది మా ఎదుగుదలపై చేస్తున్న దాడిగా పేర్కొంటూ కేంద్రం ఈడీని, ఐటీని అడ్డుపెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు యావత్ మున్నూరు కాపు సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉందంటూ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మున్నూరుకాపు జిల్లా ఉపాధ్యక్షుడు కుక్కల దేవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం లక్ష్మణ్, బత్తుల రాజం, రాములు, మెంగని బాలయ్యలు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found