భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బిజెపి భీమ్ దీక్ష చేపట్టడం జరిగింది సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షుడు గడ్డం రవి డిమాండ్ చేశారు లేని పక్షం లో సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పే వరకు దళిత మోర్చా విడిచిపెట్టే ప్రసక్తి లేదని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీను ఎస్ టి మోర్చా అధ్యక్షుడు కోనేటి సాయిలు పట్టణ అధ్యక్షుడు నేఊరి శ్రీనివాస్ రెడ్డి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మాడి స్వామి సీనియర్ నాయకులు పారి పెళ్లి సంజీవరెడ్డి గుండా డి వెంకట్ రెడ్డి సందీప్ శ్రవణ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు
