రాజన్న సిరిసిల్ల : ఫిబ్రవరి 04/
శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది…
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ….
ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్నందున అధికారులకు సిబ్బందికి పని భారం మరియు ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.స్టేషన్ రైటర్లు టెక్ టీంరైటర్లు ఎవరు బాధ్యతవారు తెలుసుకొని, ఎవరు చేయవలసినపని వారు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ రోల్ క్వాలిటీ విధులు నిర్వహించాలన్నారు, ప్రతి దొంగతనం కేసుకు సంబంధించిన నేర స్థలం, రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని జియో ట్యాగింగ్ మ్యాపింగ్ తయారుచేసి సిసిటిఎన్ఎస్ సిస్టం లో అప్లోడ్ చేయాలని సూచించారు, ఇంటరాగేషన్ రిపోర్టర్ రాసిన ప్రతి కేసులో ఇంటరాగేషన్ రిపోర్టును సిసిటిఎన్ఎస్ సిస్టం లో అప్లోడ్ చేయాలన్నారు. కేసులకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్ ను అప్లోడ్ చేయాలన్నారు, యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదాల కేసుల్లో ఫామ్ 54 పూర్తి చేసి పెండింగు ఉన్నవాటిని అప్లోడ్ చేయాలని సూచించారు, 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ చేసిన ఫోటోలు సిసిటిఎన్ఎస్ సిస్టం లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి కేసులో స్టేషన్ రైటర్ లకు, టెక్ టీం సిబ్బందికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. పోక్సో, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ కేసులలో శిక్షల శాతం మానిటర్ చేయడం జరుగుతుందన్నారు, సిసిటిఎన్ఎస్ సిస్టం లో అప్లోడ్ చేసిన చార్జిషీట్ను సిపి స్థాయి నుండి డీజీపీ స్థాయి అధికారుల వరకు మానిటర్ చేస్తున్నందున ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని తెలిపారు. స్టేషన్ రైటర్లు, టెక్ టీం రైటర్లు, ఇరువురు సమన్వయంతో విధులు నిర్వహించి యుఐ కేసులను తగ్గించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు న్యాయం చేసే విధంగా విధులు నిర్వహించిన అప్పుడే డిపార్ట్మెంట్ పై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. విడతలవారీగా ఫంక్షనల్ వర్టికల్ సిబ్బందికి, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐ. టి కోర్ ఎస్.ఐ నవత ఐటీ కోర్ సిబ్బంది స్టేషన్ రైటర్స్ టెక్ టీం సిబ్బంది పాల్గొన్నారు.





