*డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
*మండేపల్లిలో యాంటీ డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత.*
నేటి యువతరాన్ని డ్రగ్స్ కు దూరంగా ,చెడు వ్యాసనాలు విడి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు యువత ఆకట్టుకునేల తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా, టీడిఎఫ్ కెనడా సంయుక్తంగా డ్రగ్స్ అవేర్నెస్ కోసం యువతకు క్రికెట్ పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిచడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ అన్నారు.
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చే కార్యక్రమంలో భాగంగా యువతలో డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో గ్రామీణ యువతలో అవగాహన కోసం యాంటీ-డ్రగ్స్ అవగాహన క్రికెట్ టోర్నమెంట్”ను నిర్వహించారు.
*శనివారం రోజు నిర్వహించిన టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ టీమ్, అంకుశాపుర్ క్రికెట్ టీమ్ లు పోటీ పడగా ఆర్ముడ్ రిజర్వ్ టీమ్ విన్నర్ గా, అంకుశపూర్ రన్నర్ గా నిలిచారు.ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిధి హాజరైన జిల్లా ఎస్పీ గెలిచిన వారికి సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ నగదు బహుమతులు అందజేశారు.*
*ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..*
డ్రగ్స్ మూలంగా సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను వివరిస్తూ మాధకద్రవ్యాల లను తరిమి కొట్టడానికి జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,యువత కూడా మాధకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మాధకద్రవ్యాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని యువతకు పిలుపునిచ్చారు.
“యాంటి డ్రగ్ సోల్జర్ “యాప్ ను పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూ ఆర్ కోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని, యువత తాము డ్రగ్స్ తీసుకోవద్దని ఎవరైనా తీసుకున్నట్లు తెలిస్తే యాప్ ద్వారా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలనీ కోరారు.
*యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, డ్రగ్స్ సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 పోన్ ద్వారా తెలియజేయాలని కోరారు.*
అనంతరం టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
TS-NAB డైరెక్టర్ సందీప్ శాండిల్య, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో జిల్లాలో యాంటీ-డ్రగ్స్ అవగాహన క్రికెట్ టోర్నమెంట్”ను నిర్వహించాడం జరిగిందన్నారు. క్రికెట్ టోర్నమెంట్ TDF “ఆరోగ్యసేవ” ఆరోగ్య సేవా ప్రాజెక్ట్‌లో భాగం, ఇది మాదకద్రవ్యాల రహిత తెలంగాణను రూపొందించడానికి కృషి చేస్తుందన్నారు.
TDF కెనడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న విక్రమ్ మాట్లాడుతూ..
క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు వంటి ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక కార్యకలాపాలలో యువత నిమగ్నం చేయడం ద్వారా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి మట్లడుతు… ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డి, అధనవు ఎస్పీ చంద్రయ్య,రూరల్ సిఐ సదన్ కుమార్, ఆర్.ఐ యాదగిరి,
ఎస్సై సుధాకర్, tdf usa పాస్ట్ ప్రెసిడెంట్ మురళి చింతల్పని, tdf usa board members శ్రీనివాస్ గిలిపిల్లి, tdf ఇండియా జనరల్ సెక్రెటరీ వినీల్, ప్రతినిదులు చందు, చింటు, జిల్లాలోని వివిధ గ్రామాల క్రీడాకారులు, యువత పాల్గొన్నారు.
