(తిమ్మాపూర్ మార్చి 30)
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం “ఉత్సవ్- 2024” పేరుతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిఫెన్స్ రీసెర్చ్ , డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గౌట్ ఆఫ్ ఇండియా (డిఆర్ ఎంఎల్) మాజీ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి, వరంగల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ టి సి అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) సిఎస్సి విభాగం ప్రొఫెసర్ ఆర్. బి. వి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరారు.
తమ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాలను నడుపుతున్నట్లు జ్యోతిష్మతి అటానమస్ కళాశాలల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. అందుకోసం కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథులను శాలువా, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్. రావు, అకాడమీ ఆడిట్ డీన్ డాక్టర్ పీకే. వైశాలి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి. సంపత్ రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





