Breaking News

కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా!!*

127 Views

*కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా!!*

 

భోపాల్: జులై

పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టమాటా ధర రూ.200 చేరువలో ఉంది. దీంతో గృహిణులు ఆచితూచి టమోటా వినియోగిస్తున్నారు. . తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్‌ షాదోల్ జిల్లాలో ధన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమ్‌హోరి గ్రామానికి చెందిన సందీప్ బర్మన్ చిన్న దాబాను నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం వంట చేస్తున్న సమయంలో.. సందీప్‌ భార్యకు తెలియకుండా రెండు టమాటా లు కూరలో వేశాడు దీంతో మనస్తాపం చెందిన భార్య కోపంతో చిన్న కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్య తిరిగిరాకపోవడంతో చేసేదిలేక సందీప్‌ ధన్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

సందీప్‌ వద్ద అతని భార్య ఫోన్‌ నంబర్‌ తీసుకుని ట్రేస్‌ చేయగా..ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి దంపతులిద్దరికీ సర్దిచెప్పి పంపించినట్లు ధన్‌పురి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సంజయ్ జైస్వాల్ తెలిపారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *