ముస్తాబాద్/అక్టోబర్/09; ముస్తాబాద్ మండల కేంద్రంలోని 3.వ వార్డులో జియో టవర్‌ని నెలకొల్పడానికి సంబంధిత అధికారులు ప్రయత్నించారు. పోలీస్‌ల సమక్షంలో టవర్ నిర్మాణం జరుగుతుండగా కాలనీ వాసులు దీనిని అడ్డుకొనగా పోలీసులు భారీ ఎత్తున మొహరించి కాలనీ వాసులను చెదరగొట్టారు. బుధవారం కాలనీ వాసులు జీపీని ముట్టడించారు. వీరితో బీజేపీ నాయకులు మెంగని మహేందర్, ఎదునూరి గోపి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నర్సింలు, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, టవర్ నిర్మాణం జరగకూడదని, 5జి టెక్నాలజీతో జియో టవర్‌ని నిర్మిస్తే గుండె సంబంధిత వ్యాధులు, రేడియేషన్ వంటివి తట్టుకోవడం సులభ తరం కాదని సర్పంచ్ కి విన్నవించారు. సర్పంచ్ దీనిపై సానుకూలంగా స్పందించి జనవాసం ఉన్న చోట టవర్ నిర్మించడం ప్రమాద కరంమని , వెంటనే టవర్‌ని రద్దు చేయాలని పాలక వర్గం నుండి తీర్మాణం చేశారు. టవర్ ని ప్రజలు నివసిస్తున్న చోట కాకుండా మరొక చోట నిర్మించాలని జియో అధికారులతో చర్చించగా వారు కూడా సానుకూలంగా స్పందించి టవర్‌ని మూడు రోజుల్లో వేరేచోటుకి మార్చడానికి ప్రయత్నిస్తాము దీనికి జీపీ సహకరించాలని అన్నారు.
