ముస్తాబాద్, మార్చి 25 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన యాదవ్ కావట్టి పెద్దఎల్లం తండ్రి మల్లయ్య అతనికున్న 2.ఎకరాలలో వరివేసాడు నీరందక కొంత మేరకు ఎండిపోయినదన్నాడు. చేసేదేంలేక కులవృత్తిని నమ్ముకొని తమకు తెలిసిన ఆసామివద్ద అప్పుతెచ్చుకొని గొర్రెపిల్లలను సాకుదామని రోజుమేపుకొని సాయంత్రం సమయంలో ఎప్పటిలాగా పిల్లలకు సెక్యూరిటీగా జాలీలు అమర్చి భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు భోజనంచేసిన అనంతరం తొందరగా వెళ్లలేదు శనివారం రాత్రి 2.గంటల సమయంలో లేటుగా పోయేసరికి అంతలోనే కుక్కలు గొర్రె పిల్లలుఉన్న జాలికిందనుండి ప్రవేశించి దాడిచేయగా11, గొర్రె పిల్లలను విచక్ష రైతంగా కొరికివెయ్యగా 8. గొర్రె పిల్లలు అక్కడికక్కడే చనిపోగా 3.చావు బతుకుల్లో ఉన్నవని మిగతా 15, బాగున్నాయని తెలిపాడు. నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కనిండని బీద బతుకులు మావి భార్యాభర్తలు కన్నీరు మున్నీరయ్యారు. సుమారుగా 80.వేలకు పైచిలుకు నష్టం వాటిల్లినట్టు పెద్దఎల్లం తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత నాయకులు, అధికారులు, చొరవ తీసుకొని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు.
