మంచిర్యాల జిల్లాలో రైతులకు తీరనున్న యూరియా కష్టాలు.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా మరియు కొమరం భీం జిల్లా రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. యూరియా లోడుతో కూడిన రైలు శుక్రవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ కు చేరుకున్నది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీష్ బాబు యూరియా ఆన్ లోడ్ ను మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లుగా తెలిపారు. రేపటి నుంచి రైతులకు యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.





