సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన ముండ్రాతి శ్యామల, కీర్తిశేషులు శ్రీను కుమార్తె పావని వివాహానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో గురువారం నవ వధువు పావని వివాహానికి పుస్తె మట్టెలు మరియు చీరె సారే అందజేశారు. ఈ సందర్భంగా గోలి సంతోష్ మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని నిరుపేద కుటుంబానికి నా వంతు సహాయం చేయడం సంతోషంగా ఉందని కొండ పోచమ్మ తల్లి ఆశీర్వాదం నూతన వధూ వరులకు ఉండాలని కోరుకోవడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అశోక్, కొడకండ్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు