ముస్తాబాద్, మార్చి19 (24/7న్యూస్ ప్రతినిధి) మండల పరిధిలో నిన్నటి రోజున కురిసిన అకాల వడగాళ్ల వాన బీభత్సవం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులుమేరుగు అంజగౌడ్ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులపొలం దగ్గరకు వెళ్లి పంట పొలాలను పరిశీలించి రైతుల ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయినగోపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన రైతులకు నష్టపరిహారం ఇచ్చేంతవరకు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉద్యమం చేపడతామని గోపి హెచ్చరించారని పేర్కొన్ఈనారు. కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
