ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు గజ్జ కట్టి ఆడడం జరిగిందన్నారు ఆయన సేవలు తెలంగాణ ఉద్యమంలో మరువలేనివని అన్నారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నాయకులు గంట బుచ్చగౌడ్ గండికోట రవి చెన్ని బాబు మల్లారెడ్డి రామచంద్రం పరశురాములు ఉప్పుల రవి రాజు నాయక్ తిరుపతి గౌడ్ రాజేందర్ లక్ష్మీనరసయ్య రామ్ రెడ్డి రఫీక్ చెరుకు ఎల్లయ్య తిరుపతిరెడ్డి నరేందర్ చెట్టు పెళ్లి బాలయ్య పాల్గొన్నారు
