ప్రాంతీయం

జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్

146 Views

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని సార్ధపూర్ బెటాలియన్ లో గల ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది.

శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న,అధికారులకు సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్  కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్  మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం తో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలని అన్నారు. ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్  అభినదించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి ,నాగేంద్రచరి, రవికుమార్,సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కిరణ్ కుమార్, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్ ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *