ప్రాంతీయం

విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్

95 Views

బ్యాంకులో సేవలు నిల్లు ( ఆర్.బి.ఐ) స్థాపించిన కార్యాలయాల్లో మందు బాటిల్లు ఫుల్లు

విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్

మెదక్, సిరిసిల్ల,కరీంనగర్, సిద్దిపేట్

ఈ నాలుగు జిల్లాలకి విజయ్ కోఆర్డినేటర్

సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15

సిద్దిపేట జిల్లా తెలంగాణ లోనే పేరుగాంచిన జిల్లాల్లో ఒకటి అలాంటి జిల్లాలో ప్రజలకు బ్యాంకు సేవలు అందనంత దూరంలో ఉన్నాయి. దానికి నిదర్శనం బ్యాంకుల్లో జరిగే పనులు ప్రతి చోట అదే విధానం బ్యాంకులు ఉన్నవి ప్రజలకి సేవ అందించడానికి, కానీ ఎక్కడ చుసిన నిరాశనే ఎదురు అవుతున్నాయి అసలు బ్యాంకులో ఉన్న సేవలు, పాలసీ లు, లోన్లు ఏంటి అనేది ఎవరికీ తెలియదు, ఒకవేళ తెలిసిన కామన్ ప్రజలకి అందడం లేదు కనీసం తెలియని వారికి సరైన సమాధానం ఉండదు కాదు కదా బ్యాంకులో ఏచిన్న పని కోసం అయినా వెళ్లిన అది ఒకటి రెండు రోజులు పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

బ్యాంకుల పరిస్థితి ఇలా ఉంటే రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరస్యత కేంద్రాలు అని జిల్లాలో 8 కేంద్రాలు ఉన్నాయి అవి ఒక స్వచ్చంద సంస్థ వాలంటరీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ ( వీఐడీఎస్) అనే సంస్థకి ఇచ్చి నడిపిస్తుంది రిజర్వ్ బ్యాంకు . అసలు అవి ఉన్నాయి అని కూడా ప్రజలకి తెల్వదు ఆ కేంద్రాలు కేవలం విలాసలకు మాత్రమే పనికొస్తున్నాయి అని కొందరి వాదన, దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి అయితే ఇవి కేవలం వారి జీతం రావడానికి ఏదో తూ తూ మంత్రంగా జనాల ఫోటో తీసుకొని వెళ్తున్నారు కానీ అసలు బ్యాంకు మీద సరైన అవగాహన వారికే లేదు ఏకంగా ఒక సిబ్బందిని ఉపాధి హామీ కూలీలకి సురక్ష బీమా అడిగితే తెలియని పరిస్థితి రిజర్వ్ బ్యాంకు అంత ఖర్చు చేసి చేసినందుకు ప్రజలకు ఎం ఉపయోగం ఉందా అంటే ఎం లేదు, దీనికి ఒక బ్యాంకు జిల్లా అధికారి వారి కింద ఒక క్లస్టర్ కో ఆర్డినేటర్ ఈ అధికారి అయితే ఒక్కోసారి రాత్రుళ్ళు ఆఫీస్ లో ఉండడం ఆఫీస్ లోనే తాగడం చేస్తున్నారు,

ఇలాంటి నిర్వాకం జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసులో అలాగే చేస్తున్నారు ఇక ప్రతి ఆఫీస్ కి ముగ్గురు స్టాఫ్ ఉంటారు వాళ్లందరికీ  వచ్చే జీతాల్లో వీరందరితో ఆ అధికారి తాగించాలని ఆలా చేసిన  పని వత్తిడి లేకుండా చేయడం ఉంది ఇంకా అర్చర్యం ఏంటి అంటే ఇలా తాగించిన వాళ్లు ఆఫీస్ కి రాకున్నా పరవాలేదు అని చెప్పడం, వీరందరికి రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల జీతాలకి పెట్టె ఖర్చు దాదాపు జిల్లా మొత్తం కలిపి 6లక్షల పైనే ఇదంతా రిజర్వ్ బ్యాంకు అవగాహనా కార్యక్రమంతో చేసిన దానిని ఆఫీసర్లు ఎం ఆశించి దుర్వినియోగం చేస్తున్నారు బ్యాంకు లో ఉన్నది ప్రజా ధనం ప్రజా ధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు.

ఈ సిబ్బంది వల్ల ప్రజలకి ఎం ఉపయోగం ప్రతి బ్యాంకులో కనీసం అక్షరస్యత లేని ప్రజలు నిత్యం వస్తున్నారు వాళ్లకి ఏమైనా ఉపయోగం ఉందా ఈ కేంద్రాల వల్ల అంటే లేదు ప్రతి ఇంట్లో ఏదో ఒక సైబర్ నేరం జరుగుతుంది కనీసం అవగాహనా కల్పించడం లేదు. నిత్యం 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల జనాలు నిత్యం ఏదో అనారోగ్యం వల్లనో ప్రమాదల వల్లనో చాలా మంది చనిపోతున్నారు వాళ్లల్లో ఎంత మందికి ఇన్సూరెన్స్ వచ్చాయి ఎంత మందికి రాలేదు పదో పదకొండో మందికి వస్తే మిగతా కుటుంబాల పరిస్థితి ఏంటి వాళ్లకి ఎలా తెలిసేది ఇంత సిబ్బంది ఉండి ఏమి లాభం బ్యాంకు ల వల్ల కాకున్నా అవగాహనా కార్యక్రమాలు చేసే ఈ సిబ్బంది వల్ల ఏమైనా ప్రయోజనం జనాలకి వస్తుంది అంటే అది లేదు. ప్రైవేటు ఫైనాన్స్ వ్యక్తుల వాళ్ళ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇదంతా జరుగుతున్న బ్యాంకు జిల్లా అధికారులు నిమ్మకి నీరేత్తి ఉండడం దేనికి నిదర్శనం. లేదా అధికారులు కూడా ఏమైనా ముడుపులు అందుకుంటున్నారా అనేది తెలియాలి. ఇకనైనా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనీ సరైన అవగాహనా కల్పించాలని కోరుతూ నిర్లక్ష్యం వహించే వాళ్ల పైన అధికారులు సంబంధిత సిబ్బంది పైన చర్యలు ఇకనైనా తీసుకుంటారాని ప్రజలు తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *