సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..
సిద్దిపేట జిల్లా, మర్కుక్, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామం లో సావిత్రిబాయి పూలే జయంతి గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం వేడుకలు నిర్వహించారు.గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్, ఉప సర్పంచ్ జుట్టు సుధాకర్, మాజీ ఎంపీపీ పండు గౌడ్, మార్కుక్ మండల్ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య,10 వార్డ్ మెంబర్ కొండనొల్ల నరేష్, వార్డ్ మెంబర్ శ్రీనివాస్, రాజేష్ గౌడ్,సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె చేసిన సామాజిక సేవలు,మహిళా విద్యాభివృద్ధికి చేసిన కృషిని పలువురు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





